ఇక మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పగానే మనకు అతని రికార్డులతో పాటు ఫిట్‌నెస్ కూడా బాగా గుర్తుకు వస్తాయి. విరాట్ కోహ్లి తన ఆటకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. ఫిట్‌నెస్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు కెప్టెన్. ఏ ఒక్క రోజు కూడా పొరపాటున కూడా డైట్‌ను తప్పకూడదనే ఆలోచనలో ఉంటాడు. కోహ్లి ఏది పడితే అది తినకుండా అత్యంత నియమావళితో కూడిన ఆహారాన్ని మాత్రమే రోజు తీసుకుంటాడు. ఇలా ఆహారాన్ని తీసుకోవడమే కోహ్లి ఫిట్‌నెస్ ముఖ్య రహస్యం. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లిని చాలా మంది క్రికెటర్లు ఫాలో అవుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత కఠోర సాధన చేస్తాడో కోహ్లి అని. అయితే మనకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఒక సందర్భంలో చికెన్ బర్గర్ ను చూసి ఆగలేక పోయాడట కోహ్లీ.
తాజాగా ఈ విషయాన్ని కోహ్లి ఒక ఇంటర్యూలో తెలియజేయడం జరిగింది . కోహ్లి మాట్లాడుతూ.. ‘2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నేను 235 పరుగులు చేశాను. నేను గేమ్ ఉన్న రోజున ఎక్కువగా ఆహారాన్ని తీసుకోను. కేవలం అరటి పండు -మంచి నీళ్లు మాత్రమే తీసుకుంటా అని తెలిపాడు. కానీ అప్పటి ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసూ బంఫర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ రాత్రి మీరు ఏమైనా తినొచ్చు అని తెలిపాడు. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినమని చెప్పగా.. దాంతో నేను చికెన్ బర్గర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
అప్పటికి నేను మాంసం తింటున్నాను. ఒక బన్‌ను ఓపెన్ చేశా. ఇక ఆగలేకపోయా. ఆపకుండా తినడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఒక పీస్ బ్రెడ్ లాగించేశా. మరొకవైపు పెద్ద ప్లేట్‌లో ఉన్న ఫ్రై కూడా తినేశా. ఆపై చాకోలెట్ షేక్‌ను కూడా తీసుకున్నా. దాంతో పాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియలో పోస్ట్ పెడుతా ఉంటాడు.